మంచిర్యాలటౌన్/ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 26 : ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులు 4852 మంది హాజరు కావాల్సి ఉండగా, అందులో 4758 మంది హాజరయ్యారు. 94 మంది గైర్హాజరు అయ్యారు. అలాగే వొకేషనల్ విద్యార్థులు 788 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, అందులో 765 మంది పరీక్షకు హాజరయ్యారు. 23 మంది గైర్హాజరు అయినట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4439 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 4345 హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రాందాస్ తెలిపారు. జనరల్‌లో 3776 మందికిగాను 3698 మంది, ఒకేషనల్‌లో 663 మందికిగాను 647 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.