బెల్లంపల్లి, మే 12 : పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అదనపు కలెక్టర్ రాహుల్‌తో కలిసి పోలీసు అధికారు లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మానిటరింగ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సెక్టార్ అధికారులు, పోలింగ్ రూట్ మొబైల్ అధికారులు, ఆర్మ్డ్ అధికారుల నడుమ పరికరాలను సదరు లొకేషన్లకు తరలించినట్లు వె ల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏసీపీ రవికుమార్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
బెల్లంపల్లి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రి య సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. ఆదివారం పట్టణంలో ని తిలక్‌స్టేడియం ఆవరణలో ఎన్నికల సామగ్రిని అధికారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. నాలుగు గంటల్లోపు కేంద్రం లోపల ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు.