బెల్లంపల్లి, జనవరి 13 : అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లిలోని వందపడకల దవాఖాన కాంట్రాక్ట్ కార్మికులు ఆకులు తింటూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు రమణ, కార్యదర్శి రంజిత్‌కుమార్ మాట్లాడుతూ పెండింగ్‌లోనున్న ఐదునెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ పొందినప్పటి నుంచి ఏ నెల కూడా జీతం ఇవ్వలేదని పేర్కొన్నారు. పీఎఫ్ పేరుతో కోత విధించిన డబ్బులు కూడా కార్మికుల ఖాతాల్లో జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. వేతనాల చెల్లింపులోనూ అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టి, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 20న కలెక్టరేట్ ఎదుట ధ ర్నా చేపడుతామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కా ర్యదర్శి సంకె రవి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యద ర్శి శ్రీనివాస్, మండల కన్వీనర్ దేవదాస్ పాల్గొన్నారు.