నిర్మల్ అర్బన్, డిసెంబర్ 13 : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అభియాన్ ఉద్యోగులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగేంతలోపే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని అమలు చేయాలని గుర్తు చేస్తూ శుక్రవారం ని ర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదు ట కాంట్రాక్ట్ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు రోడ్డుపై చాయ్ చేసి అక్కడే ఏర్పాటు చేసిన రేవంత్రెడ్డి విగ్రహానికి చాయ్ తాగించి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రతినిధి పడాల రవీందర్ వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చాయ్ తాగేంతలోపే రెగ్యులర్ చేస్తామని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మా టను నిలబెట్టుకోవాలని నిరసన తెలిపినట్లు చెప్పారు. సమ గ్ర శిక్ష ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని లేదం టే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ ఇర్ఫా న్, జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్, లక్ష్మ ణ్, చొక్కారావు, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర బాబు, రమణా రావు, యాటకారి సాయన్న సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు గంగాధర్, రాజారత్నం, ఆనంద్, హరీశ్, స్పందన్స్పందన్, విజయ్, నవిత, వీ ణా, అపర్ణ, గంగామణి, ప్రభ, జ్యోతి, శ్రీతల దేవి, సాయినాథ్, వివేక్ పాల్గొన్నారు.