కెరమెరి, ఆగస్టు 10 : జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగజ్‌నగర్ డివిజన్‌తో పాటు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో దాని కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల అ నార్పల్లి అడవుల్లో పులి ఓ మేకను చంపగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అడవుల్లో ఉన్నది పులినా.. లేకా చిరుతనా అని తేల్చేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు. శనివారం కెరమెరి ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ ఆధ్వర్యంలో సిబ్బంది పులి అడుగు జాడలు కనుకునేందుకు అనార్పల్లి వాగు దాటి దేవాపూర్ బీట్ పరిధిలోని అడవుల్లో వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. అనార్పల్లితో పాటు కరంజీవాడ, బోరిలాల్‌గూడ అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.