తాండూర్ : వ్యవసాయ శాస్త్రవేత్తలు ( Agricultural scientists ) , అధికారుల సూచనలు పాటిస్తే రైతులు అధిక లాభాలు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి కే సుష్మ ( K Sushma ) అన్నారు. నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా చౌటపల్లి, తాండూర్ గ్రామాలలో వరి, పెసర పంటల క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. పంటల సాగు, వాతావరణ మార్పు, పంటల స్వభావం, సీజన్లో వచ్చే చీడ పీడల నివారణ వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు వరి, పెసర విత్తనాలను సరఫరా చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు యూ శంకర్, ఎం వెంకటేష్, రైతులు పాల్గొన్నారు.