ఎదులాపురం, సెప్టెంబర్ 18 : తెలంగాణ భవన నిర్మాణం, ఇతర నిర్మాణ కార్మికుల బో ర్డు అమలు చేస్తున్న పథకాలను సంక్షేమ బో ర్డు ద్వారా కాకుండా ప్రైవేట్ పరం చేయడానికి వేస్తున్న టెండర్లను రద్దు చేయకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన ని ర్మాణ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆ ధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కా ర్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. వెల్ఫేర్ బోర్డు పటిష్ట పర్చాలని సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం రూ పంలో అందజేస్తామన్నారు. సెప్టెంబర్ 23వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వెల్ఫేర్ బోర్డు రక్షణ కో సం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత ని ర్ణయాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి, జిల్లా నాయకులు ఆర్.సురేందర్, సురేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ జిల్లా కో-కన్వీనర్ దుమాల అశోక్, నాయకులు విఠల్, బాగువండ్లు, శంకర్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, జిల్లా నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, మారుతి, సహాయ కార్యదర్శి ఉమ్రే నితిన్ పాల్గొన్నారు.