మంచిర్యాలటౌన్, జనవరి 27 : పదవీకాలం ముగిసినా ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కరించడానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం మంచిర్యాలలోని తన నివాసంలో పదవీకాలం (జనవరి 26న) పూర్తి చేసుకున్న మున్సిపల్ ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మంచిర్యాల, నస్పూరు, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులకు శాలువాలు కప్పి, బహుమతులు అందించారు.
ఐదేళ్ల పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుకు చేసుకున్నారు. దివాకర్‌రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయని, పార్టీకోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూరు, లక్షెట్టిపేట మున్సిపాలిటీల మాజీ చైర్మన్లు పెంట రాజయ్య, ఈసంపల్లి ప్రభాకర్, నలుమాసు కాంతయ్య, బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, అత్తి సరోజ, మందపల్లి స్వర్ణలత, శ్రీనివాస్, పల్లె భూమేశ్, సాగి వెంకటేశ్వరరావు, సురేందర్‌రెడ్డి, పానగంటి సత్తయ్య, ఎర్రం తిరుపతి, పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మరోసారి గులాబీ జెండా ఎగరేద్దాం
లక్షెట్టిపేట(దండేపల్లి), జనవరి 27 : మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పట్టణంలో మున్సిపల్ పాలకవర్గానికి నిర్వహించిన ఆత్మీయ సత్కారానికి ఆయన హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లక్షెట్టిపేట పట్టణంలో గులాబీ జెండా ఎగరేద్దామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, తాజా మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు నల్మాసు కాంతయ్య, పొడేటీ శ్రీనివాస్‌గౌడ్, డీసీఎమ్మెస్ తిప్పని లింగన్న మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పెట్టెం తిరుపతి, మంద శ్రీనివాస్, మోటపల్కుల గురువయ్య, నల్మాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు.