రెబ్బెన, మే 18 : రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడకు చెందిన టేకాం పోశం(68) తేనె టీగల దాడిలో మృతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. టేకాం పోశం గోలేటి శ్రీ భీమన్న ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు.
ఎప్పటిలాగే శనివారం ఉదయం శ్రీ భీమన్న ఆలయానికి వెళ్లాడు. భక్తులు అక్కడే వంట చేస్తుండగా పొగ వ్యాపించి సమీపంలోని వేప చెట్టు పైనున్న తేనె టీగలు ఒక్కసారిగా లేచి పోశంను చుట్టుముట్టి దాడి చేయగా, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోశం కుమారుడు టేకాం భీంరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.