కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా గాంధీ (Kotapalli KGBV) బాలికల విద్యాలయంలో శుక్రవారం హోలీ వేడుకలను (Holi celebrations) ఘనంగా నిర్వహించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో సహజసిద్ధమైన రంగులను ఉపయోగించి విద్యార్థులు, ఉపాధ్యాయులు వేడుకలను జరుపుకున్నారు.
రంగుల పండుగ హోలీకి సహజసిద్ధమైన రంగులను (Natural Colors) వినియోగించాలని, రసాయనాలతో తయారు చేసిన రంగుల వల్ల అనేక అనర్థాలు వస్తాయని అన్నారు. విద్యార్థులు ఒక లక్షాన్ని నిర్దేశించుకొని వాటిని చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.