ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా మంగళవారం హోలీ వేడుకలు కనులపండువగా కొనసాగాయి. చిన్నారులు, పెద్దలు, మహిళలు, ప్రముఖులు ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నృత్యాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న నాయకులు, కార్యకర్తలతో హోలీ ఆడారు.

ఆదిలాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తోపాటు ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి.మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్‌లు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. అలాగే నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో కూడా ఎస్పీ జానకీ షర్మిల హోలీ ఆడారు.
– ఎదులాపురం/నిర్మల్ ఫొటోగ్రాఫర్, మార్చి 3