నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 23 : లక్ష్మణచాంద మండలం తిర్ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షం లో బీఆర్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బీఆర్ చేరడం అభినందనీయమన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరాదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తిర్ గ్రామం నుంచి అత్యధిక ఓట్లు బీఆర్ పడేలా చూస్తామని ఈ సందర్భంగా నాయకులు, యువకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, ఓస రాజేశ్వర్, రఘునందన్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ తదితరులున్నారు.
హరీశ్వర్ రెడ్డి మృతికి మంత్రి సంతాపం..
మాజీ ఉప సభాపతి, పరిగి మాజీ ఎమెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరణంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు..
నిర్మల్ జిల్లాలో ఈ నెల 25న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రావాల్సి ఉన్నది. కాగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలో ఆయన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు బీఆర్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. త్వరలో పర్యటన వివరాలను వెల్లడిస్తామని తెలిపాయి.
నిర్మల్ పట్టణాభివృద్ధే ధ్యేయం
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 23 : నిర్మల్ పట్టణాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపాపల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల టీయూఎఫ్ నిధులను కేటాయించింది. ఆ నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బీఆర్ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణాభివృద్ధికి అడిగిన వెంటనే రూ.50 కోట్ల నిధులను కేటాయించారన్నారు. ఈ నిధులతో ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి వార్డుకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రూ.9.80 కోట్లతో 42 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ.5 కోట్లతో నూతన పురపాలక సంఘ భవనం, రూ.4 కోట్లతో ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ హాల్, రూ.2 కోట్లతో ధర్మసాగర్ చెరువు మురుగు నీటి శుద్ధీకరణ, రూ.3 కోట్లతో ధర్మసాగర్- మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, రూ.1.50 కోట్లతో కట్ట విస్తరణ, రూ.2 కోట్లతో ఇబ్రహీం చెరువుకట్ట విస్తరణ, రూ.2.50 కోట్లతో పాత తహసీల్ కార్యాలయం వెనుక పార్కు అభివృద్ధి, ఇతర చెరువుల అభివృద్ధి, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రధాన కూడళ్ల ఆధునీకరణ, సైక్లింగ్ ట్రాక్, సామాజిక భవనాలు, శ్మశాన వాటికలు, తదితర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. టెండర్లు పూర్తికాగానే పనులు వేగంగా చేయించి ప్రజల ఇబ్బందులు తీరుస్తామన్నారు.నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, ఎఫ్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, బీఆర్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
నిర్మల్ పట్టణంలో పలువురిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. పట్టణంలోని బాగులవాడ-మోతీనగర్ కాలనీకి చెందిన దేవోళ్ల గంగాధర్ భార్య విజయ ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి వారి ఇంటికెళ్లి గంగాధర్ పరామర్శించారు. తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అదేవార్డులకు చెందిన పార్టీ కార్యకర్త షారూఖ్ డెంగీతో బాధపడుతున్నాడు. అతన్ని మంత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్ రావు, నాయకులు తదితరులున్నారు.
సారంగాపూర్ మండలంలో..
సారంగాపూర్, సెప్టెంబర్ 23 : మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ లక్కాడి కరుణాసాగర్ సోదరుడు లక్కాడి రాజేశ్వర్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెం దాడు. విషయం తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ బాధితుల ఇంటికెళ్లి పరామర్శించారు. మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీలు అట్ల మహిపాల్ రాజేశ్వర్ బీఆర్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు రవీందర్ నాయకులు రాంకిషన్ శ్రీనివాస్ పతాని భూమేశ్, వంగ భూమారెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్ తదితరులున్నారు.