HomeAdilabadHe Has Been Suffering From Cancer For Six Months And Has Been Roaming Around Hospitals
జీవన పోరాటం.. సాయం కోసం ఆరాటం
ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.
ఓ ఇంటి పెద్ద ప్రాణాన్ని కాపాడండి
ఆరు నెలల నుంచి క్యాన్సర్‌తో తండ్రి
ఇప్పటి వరకు రూ.10 లక్షల అప్పు
గుడిసె, స్థలం అమ్మి క్యాన్సర్‌కు వైద్యం
మరో 6 లక్షల కోసం ఎదురుచూపు
ఖానాపూర్ రూరల్, మే 18 : ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం. అయినా అవి సరిపోవని మరో రూ. 6 లక్షల అయితేనే అతడి ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలిపారు. దీనస్థితిలో ఉన్న తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలని ముగ్గురు పిల్లలు, అతడి భార్య ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు స్పందించి సాయం అందించాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన కడమంచి రాజేశ్ (37) బుడగజంగం కులరీత్యా గ్రామాలతో పాటు పట్టణంలో భిక్షాటన, కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య లావణ్య, పిల్లలు హారిక(10), రాజశ్రీ(8), అభినందన్(7) ఉన్నారు.
రాజేశ్‌కు క్యాన్సర్ వ్యాధి ఉందని ఆరు నెలల క్రితం నిర్ధారణ కావడంతో నిర్మల్ జిల్లాలోని దేవేందర్ రెడ్డి, ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలో ఆరు నెలలుగా చికిత్స పొందుతున్నాడు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన రాజేశ్, ఇంట్లో పిల్లల తిండికి, మందులకు డబ్బులు లేక దుర్భర జీవితం గడుపుతున్నారు. పేద కుటుంబం కావడంతో సాకేవారు లేక భార్య పిల్లలు తల్లడిల్లుతున్నారు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల దయనీయ పరిస్థితిని చూసి సాయం చేయాలని బంధువులు, స్థానికులు సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. దాతలు 9959381097కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.