HomeAdilabadHarish Rao To Give Powerpoint Presentation
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బట్ట బయలు చేసిన హరీశ్‌రావు
కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్ కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించగా, నస్పూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఎల్ఈడీ స్క్రీన్లపై నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
కేసులకు భయపడేది లేదన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్ కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించగా, నస్పూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఎల్ఈడీ స్క్రీన్లపై నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. దాదాపు 1.20 గంటల పాటు హరీశ్‌రావు ప్రసంగం కొనసాగగా, ఆసక్తిగా విన్నారు. కాంగ్రెస్ కుట్రలు, మోసాలు, ప్రాజెక్ట్ ప్రాధాన్యత, అనుమతుల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కష్టపడిన తీరుపై ఆయన చక్కగా వివరించారు. మొత్తానికి ఆయన ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/సీసీసీ నస్పూర్, ఆగస్టు 5
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్రపంచస్థాయిలో గుర్తింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ప్రపంచస్థాయిలో తెలంగాణకు గుర్తింపు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి అహోరాత్రులు కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఉమ్మడి పది జిల్లాలకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని, తక్కువ సమయంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కేసీఆర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపుకు ఆకర్షించేలా చేశారని కొనియాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ప్రాజెక్ట్‌లు, అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు.
ఇది వరకు పంజాబ్, హర్యానా, ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయం అత్యధికంగా చేసేవారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఉమ్మడి జిల్లాల్లో వాగులు, చెరువులు, ప్రాజెక్ట్‌లు నిండుకుండలను తలపించాయన్నారు. నీటి నిల్వలతో మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. తెలంగాణకు పరిశ్రమలు కుప్పలు తెప్పలుగా వచ్చాయని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులున్నప్పటికీ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. నారాయణపూర్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే భూమిపూజ చేసి పనులు ఎలా ప్రారంభిస్తారని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ బెదిరింపులకు, కేసులకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ భయపడరని, అలా కేసులకు భయపడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదికాదన్నారు.
దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచా రాన్ని తిప్పికొడుతామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రికార్డు స్థాయిలో పంటలు పండాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని వాడుకుంటూనే విష ప్రచారం మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, కమీషన్లు తీసుకున్నారని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుందన్నా రు. విచారణ పేరుతో కొన్ని నెలల పాటు డ్రామాలు మొదలుపెట్టి, కమిషన్ నివేదిక పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక్క రూపా యి కూడా అవినీతి జరగలేదని, రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేశారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి నీరు అందక రైతులు గోస పడుతున్నారని వివరించారు.
ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి, మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. నీరులేక ఎండిన గోదావరి ఘోషిస్తుందన్నారు. మత్స్యకారులకు చేపల వేట లేక ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు నీరు సక్రమంగా అందడంలేదని, దీంతో తెలంగాణకు పరిశ్రమలు రావడం తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక డ్రామాలు ఆపి, వెంటనే ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు.
ఆయాచోట్ల నాయకులు డాక్టర్ రాజారమేశ్, అక్కూరి సుబ్బయ్య, గాదె సత్యం, నల్మాస్ కాంతయ్య, అత్తి సరోజ, వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, పల్లె భూమేశ్, మేరుగు పవన్‌కుమార్, గోగుల రవీందర్‌రెడ్డి, గర్శె రామస్వామి, జక్కుల రాజేశం, హైమద్, పానుగంటి సత్తయ్య, జక్కుల కుమార్, పెరుమాళ్ల జనార్దన్, దగ్గుల మధు, కాటం రాజు, మేడం తిరుపతి, సంపత్‌కుమార్, అడ్లకొండ రవిగౌడ్, ఆసిఫాబాద్ పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్, మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జాబరి రవీందర్, నాయకులు లకెనాయక, శ్రీధర్,భీమేశ్, హైమద్ నిసార్, అన్సార్, కార్యకర్తలు పాల్గొన్నారు.