ఎదులాపురం,డిసెంబర్ 23: రాజకీయాలకు అతీతంగా అందరూ రైతులకు అండగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్‌లో అన్నదాత విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు సాజీద్‌ఖాన్, సుజాత, సంజీవ్ రెడ్డి, రైతు సంఘం నాయకులతో కలిసి శనివారం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. రైతుల కష్టమే అందరి జీవనానికి కారణమవుతోందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన రైతులను కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలన్నారు. రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి , గోవర్ధన్ యాదవ్, కొండ నారాయణ, లోకారి పోశెట్టి, కాళ్ల విఠల్, దర్శనాల మల్లేశ్, లంకా రాఘవులు, దారట్ల కిష్టు, సుహాసిని రెడ్డి, గణపతిరెడ్డి పాల్గొన్నారు.