ఎదులాపురం, సెప్టెంబర్ 4 : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురసరించుకొని గురువారం ఆదిలాబాద్ జడ్పీ హాల్లో గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఐటీడీఏ పీవో, జిల్లా ఇన్చార్జి డీఈవో ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 72 మంది ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లతోపాటు మెమోంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర, సెక్టోరియల్ అధికారులు రఘు రమణ, ఉదయశ్రీ, సుజాత్ అలీ పాల్గొన్నారు.