ఆదిలాబాద్ : బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు (BRS Formation) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా జరిగాయి. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచి పెట్టారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బి), నిఘ్వ, మాలేగాం, పల్సి తదితర గ్రామాలలో బీఆర్ఎస్ అధ్యక్షులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిల అనిల్, పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఉద్యమ నాయకులు పుప్పాల పీరాజీ, మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, గంధం పోశెట్టి, బాబు, పల్సి లో అధ్యక్షుడు డా. కుబ్రే రాజన్న, భోజరాం పటేల్, చాతాలో మాజీ ఎంపిటిసి విట్టల్, ఆయా గ్రామాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తాండూర్లో ..

బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు తాండూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తాండూర్ ఐబీలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు జెండాలను ఆవిష్కరించారు.