నెన్నెల, జూన్ 27 : డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ్లేందుకు సిద్ధం కాగా, పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అర్హులైన వారిని జేపీవోలుగా నియమించాలని, రెగ్యులర్‌గా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాండూర్, జూన్ 27 : మండలంలోని సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం మాట్లాడుతూ అరెస్టులతో ఉద్య మాలను ఆపలేరని, గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిషారమయ్యే వరకూ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు సోమ మొగిలి, వేల్పుల శంకర్, బొల్లం రాజేశం ఉన్నారు.