సారంగాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది అన్నారు. శుక్రవారం నిర్మల్ ( Nirmal ) జిల్లా సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, తాండ్రజి, వంజర్, ప్యారమూర్, వైకుంఠాపూర్, ధని, గోపాల్ పేట్, చించోలి (బి), గ్రామాల్లో ఐకేపీ( IKP ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ( Paddy Purchase Centre ) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలను అందించి ఆదుకుంటుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెప్పారు. భూభారతి పథకం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవు తాయన్నారు. పేదలు సన్న బువ్వ తినాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతి పేదవాడికి 6 కిలోల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని వివరించారు.
మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంట నమ్ముకుని గిట్టుబాటు పొందాలని సూచించారు. దళారులకు అమ్మితే తూకంలో మోసం, ధరల్లో వ్యత్యాసంచేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బాలిక్ హమ్మద్, ఐకేపీ ఏపీఎం మాధురి, శంకర్ రెడ్డి, పోతారెడ్డి, సుభాష్ రెడ్డి, ప్రశాంత్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్, మధుకర్, భూమారెడ్డి, ముత్యం రెడ్డి, మురళి, సాయన్న, ప్రేమానంద్, భోజన్న, సూర్యం, సత్యం, మషీర్, ముక్యర్, రైతులు పాల్గొన్నారు.
Grain purchase center inaugurated under the auspices of IKP