బేల, జనవరి 25 : తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని బాది పంచాయతీ పరిధిలోని మల్కుగూడ గ్రామంలో బుధవారం నిర్వహించిన కుమ్రం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు గ్రామస్తులు డోలు వాయిద్యాల మధ్య ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మండల నాయకులతో కలిసి జెండా ఎగురవేసి భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోడు భూముల పట్టాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని మండిపడ్డారు.
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆదివాసీ, బంజారా భవనాలు నిర్మించి ఇ చ్చారన్నారు. పది శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ, విద్యలో అవకాశాలు పెంచినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నా రు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండలాధ్యక్షుడు కల్యాం ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ పౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, గ్రామ సర్పంచ్ సిడాం లక్ష్మీబాయి, బీఆర్ఎస్ నాయకులు బండి సుదర్శన్, వినోద్ దం తెల, ఆశన్న, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
బాది ప్రాథమిక పాఠశాల సందర్శన
మండలంలోని బాది ప్రాథమిక పాఠశాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండల నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు. ‘మనఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులు, మధ్యాహ్న భోజనం, వంట గదిని పరిశీలించి వస్తువుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ , బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, ప్రమోద్‌రెడ్డి, బండి సుదర్శన్ , వినోద్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
బోథ్, జనవరి 25 : జైనథ్ మండలంలోని కాప్రి లో పలు అభివృద్ధి పనులకు ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న భూమిపూజ చేశారు. రూ.50 లక్షలతో నిర్మించనున్న గీతామందిరం కల్యాణమండపానికి భూమిపూజ చేశారు. అలాగే మైస మ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన మాల సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్.లింగారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సర్పంచ్ ఎల్టీ రమీలా వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా రాంరెడ్డి, నాయకులు ప్రశాంత్, వేణుయాదవ్, వెంకటి, కేషవ్, రమేశ్ తదితరులు ఉన్నారు.