ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన -ఉరు మన బడి కింద రూ. 1.30 లక్షలతో మంజూరైన అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
రూ. ఏడువేల కోట్లు కేటాయించి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.