బోథ్, మే 17 : అకాల వర్షానికి తడిసిన ధా న్యాన్ని ప్రభుత్వమే కొనాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో నిల్వ ఉన్న జొన్నలు రెండు రోజులుగా కు రుస్తున్న వర్షానికి తడిసిపోయాయి. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూడు కాంటాలతోనే కొనుగోలు చేస్తున్న విషయం గమనించిన ఎమ్మెల్యే తక్షణమే కాంటాలను 6కు పెంచాలని, రెండు రోజుల్లో పూర్తి ధాన్యం కొనాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు సమస్యలపై హమాలీ కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులకు అండగా బీఆర్ఎస్..
తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందవద్దని,అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాడుతుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడలోని మార్కెట్ యార్డుకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్లో మాట్లాడి ధాన్యాన్ని వెంటనే కొనాలన్నారు. మార్కెట్ యార్డులో రెండు షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి రమే శ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
అకాల వర్షం బాధితులను ఆదుకోవాలి
గుడిహత్నూర్ మండలంలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. హనుమాన్‌నగర్ కాలనీలో ఈదురుగాలులతో ఇండ్ల పైకప్పులు, షాపుల పైకప్పులు ఎగిరిపోవడంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. వారికి తక్షణ సహాయం కింద కొంత ఆర్థిక సహాయం అందజేశారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట నాయకులు జాదవ్ రమేశ్, జీ తిరుమల్‌గౌడ్, సంజీవ్ ముండె, జాదవ్ భీంరావ్, దోమకొండ సుధాకర్, ఎండీ గఫార్, కేంద్ర వెంకట్రావ్, ఆశన్న యాదవ్, సుశీల్, నక్క భూమన్న, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.