పంట అమ్మినా పడిగాపులే
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉ న్నాయి. యాసంగిలో పండిన జొన్నల కొ నుగోళ్లను ప్రభుత్వం ఆలస్యంగా చేపట్టిం ది.
- లారీలు, హమాలీల కొరతతో తరలింపులో జాప్యం
- జొన్న సంచుల వద్ద రాత్రీపగలూ రైతుల కాపల
- మార్కెట్ యార్డును ముంచెత్తిన జొన్న నిల్వలు
ఆదిలాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉ న్నాయి. యాసంగిలో పండిన జొన్నల కొ నుగోళ్లను ప్రభుత్వం ఆలస్యంగా చేపట్టిం ది. దీంతో పక్షం రోజులుగా అమ్మకునేందుకు అవకాశం లేకుండా పోయింది. పొ లాల్లోనే జొన్నలను నిల్వచేసి రాత్రి, పగ లు కాపల ఉంటున్నారు. అదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించిన ఐదు రోజులవరకు కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో వర్షానికి పంట తడిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు న మోదవుతుండగా ఎండలు మండిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంటను సేకరిస్తామని ప్రకటించిన అధికారులు కొనుగోళ్లను తరచూ వాయిదా వేస్తున్నారు. వా యిదా అనంతరం ఈ నెల 14న కొనుగోళ్లను ప్రారంభించిన పీఏసీఎస్ సిబ్బంది ఐదు రోజులపాటు కొనుగోలు చేసి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్ యార్డులో పంట నిల్వలు పేరుకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి కొనుగోళ్లను ఎప్పుడు ప్రారంభిస్తామని విషయం చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రవాణాలో జాప్యం
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతుల వద్ద సేకరించిన జొన్న పంటను గోదాముల్లోకి తరలించడంలో జాప్యం జరుగుతున్నది. జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లో వేల క్వింటాళ్ల జొన్నలను కాంటా వేసి సంచుల్లో నింపిన లారీలు, హమాలీల కొరత కారణంగా గోదాముల్లోకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతుల పంటను కాంటా చేసిన పీఏసీఎస్ సిబ్బంది వారికి కొనుగోళ్ల పత్రాలు ఇవ్వడం లేదు. సంచుల్లో నింపిన జొన్నలు లారీల్లో లోడ్ చేసిన తర్వాత వివరాల పత్రాలు ఇస్తామని అప్పటి వరకు ఉండాలని సూచిస్తున్నారు. దీంతో రైతులు వారం రోజులుగా మార్కెట్ యార్డులోని సంచుల వద్ద రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. రోజుకు ఎనిమిది లారీలు వస్తున్నాయని ఐదు వేల సంచులు మాత్రమే రవాణా చేస్తున్నారని రైతులు తెలిపారు. రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో ఎప్పుడు వర్షం పడుతుందో, పంట తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వారం రోజులగా కాపలా ఉంటున్నా..
నేను పోయిన మంగళవారం మార్కెట్ యార్డుకు జొన్నలను తీసుకొచ్చా. గురువారం కాంటా వేయగా 57 క్వింటాళ్లు అయింది. అమ్మిన వివరాల కాగితాలు ఇవ్వమంటే లారీల్లో లోడైన తర్వాత ఇస్తామని అధికారులు అంటున్నారు. చేసిదేమీ లేక ఐదు రోజులుగా జొన్న సంచుల వద్ద కాపలా ఉంటున్నా. నాతోపాటు చాలా మంది రైతులు వారి సంచుల వద్ద రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం కొన్ని లారీలు వచ్చినా మా సంచుల కాడికి రావాలంటే ఇంకా రెండు రోజుల సమయం పడుతుంది. వర్షం పడితే తడవకుండా ప్లాస్టిక్ కవర్లు కప్పినా కింద నుంచి వరద వచ్చి తడుస్తాయి. – సంతోష్,రైతు, పొన్నారి, తాంసి మండలం
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

