నార్నూర్ : వంటకాలు చేసేటప్పుడు సరుకులు శుభ్రం చేసి వడ్డించాలని ఐటీడీఏ ఏటీడీవో క్రాంతి కుమార్ ( Kranti Kumar) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలను గురువారం సందర్శించారు. పాఠశాలలోని రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టిక వివరాలను ప్రధాన ఉపాధ్యాయుడు జాదవ్ విట్టల్, వార్డెన్ పవర్ వనితను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలన్నారు. పరిసరాలు, విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత పై దృష్టి సారించాలని కోరారు. ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం వంటకాలు చేసేటప్పుడు సరుకులను శుభ్రం చేసి వంట చేయాలని సూచించారు. ఆర్ బి ఎస్ కే వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ వైద్య అధికారి జాదవ్ మనోజ్, పీడీ ఆడే విశ్వనాథ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.