ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : విద్యార్థులు, యువతులకు చట్టాల ( Laws ) పై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ( Judge Yuvaraja) అన్నారు. ఈ నెల 11 వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ , డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
సమాజంలో జరుగుతున్న మోసాలు, దౌర్జన్యాలపై రాజ్యాంగం, కోర్టులు చట్టాలు చేశాయని వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సాయిని రాజశేఖర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ , సివిల్ కోర్టు సూపరింటెండెంట్ సుభాష్, రాణి తదితరులు ఉన్నారు.