నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 5: నిర్మల్ పట్టణంలో శనివారం గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో గణేశ్ శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. నిర్మల్‌లోని ప్రధాన కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నేరుగా కంట్రోల్ రూంకు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇద్దరు ఏఎస్పీలు, 11 మంది సీఐలు, 31 మంది ఎస్ఐలు, 106 మంది ఏఎస్‌లు, హెడ్ కానిస్టేబుళ్లు, 323 మంది కానిస్టేబుళ్లు, 31మంది మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శోభాయాత్ర మార్గంలో ధా ర్మిక స్థలాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పా టు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీ సుకున్నట్లు తెలిపారు. ఆమె వెంట ని ర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్ఐ అడ్మిన్ రాంనిరంజన్, సిబ్బంది ఉన్నారు.