జైపూర్, సెప్టెంబర్ 15 : జైపూర్ మండలం ఇందారం గోదావరిబ్రిడ్జివద్ద వినాయక నిమజ్ఞనానికి ఏర్పాట్లు చేయగా, ఆదివారం రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ రామగుం డం మున్సిపాలిటీ, సింగరేణి సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జిపై టేబుల్స్, క్రేన్లు, సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేయడం తో పాటు సింగరేణి రెస్క్యూ సిబ్బందిని నియమించారు.
ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 40 మందికి కల్యాణ లక్ష్మి చెకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.