నార్నూర్, సెప్టెంబర్, 8 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన సిందే రుక్మాబాయి అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సిందే రుక్మాబాయి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు అంతక్రియల నిమిత్తం తన వంతు సహాయంగా రూ.5000 అందజేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నేను పదవిలో ఉన్నా లేకున్నా నిరుపేదలకు ఎల్లవేళల అండగా ఉంటానని ఆయన తెలిపారు.