సకల జనుల సంక్షేమమే ధ్యేయం
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే, పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
- ఇంటింటా ఏదో ఒక పథకంతో లబ్ధి
- కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి
- ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
- కుంటాల మండలంలో ప్రచారానికి శ్రీకారం
కుంటాల, అక్టోబర్ 26 : సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే, పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా మార్గంమధ్యలో ఓలా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జెండా ఆవిష్కరించారు. అనంతరం సూర్యాపూర్ గ్రామానికి వెళ్లి, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అడిగారు. ప్రచార వాహనంలో పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ కుటుంబం ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందుతున్నదన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తమ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేయాలని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు పెంటవార్ దశరథ్, ఏఎంసీ భైంసా మాజీ చైర్మన్ కృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖదీర్, నర్సాపూర్ పార్టీ మండల కన్వీనర్ పాపెన్ రాజేశ్వర్, జాగృతి మండల అధ్యక్షుడు బోగ లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

