సిర్పూర్(యూ), ఫిబ్రవరి 27 : మండలంలోని మహగాం శివాలయం సామూహిక వివాహాలకు వేదికైంది. గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో 15 జంటలకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. యేటా నిర్వహిస్తున్నట్లే ఈ యేడాది కూడా ఉచితంగా మంగళసూత్రాలు, మట్టెలు, పట్టువస్ర్తాలు అందించి పెళ్లిళ్లు జరిపించి ఆశీర్వదించారు. అతిథులందరికీ భోజనం పెట్టారు. కాగా, యేటా మహాశివరాత్రిని పురస్కరించుకొని మహగాంలోని సంత్ సూరోజీబాబా మందిరం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మర్సుకోల సరస్వతి, సురోజీబాబా పీఠాధిపతి మెస్రం కైలాష్, జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, నాయకులు హన్ను పటేల్, తొడసం భాగ్యలక్ష్మి, తొడసం ధర్మరావు, భూపతి, శంకర్, ఆడే లక్య, భీంరావుస్వామి, సార్మేడి ఆనంద్‌రావు, విశ్వంబర్, సీతారాం పాల్గొన్నారు.
మహదేవ్ మందిరంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతరలో పర్యటించి వ్యాపారులతో ముచ్చటించారు. కబడ్డీ పోటీలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మర్సుకోల సరస్వతి, మాజీ ఎంపీపీలు ఆత్రం భగవంత్‌రావు, తొడసం భాగ్యలక్ష్మి, తొడసం ధర్మరావు, జాతర కమిటీ నాయకులు గోవింద్రావు, దౌలత్‌రావు, కుంర భీంరావు ఉన్నారు.
జైనూర్, ఫిబ్రవరి 27 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జైనూర్ మండలం పట్నాపూర్‌లోని శ్రీశ్రీశ్రీ పరమ హంస సద్గురు ఫూలాజీబాబా సంస్థానములో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఫూలాజీ బాబా సతీమణి ఇంగ్లే దుర్పతాబాయి, ఫూలాజీ బాబా తనయులు కేశవ్ ఇంగ్లే, వామన్ ఇంగ్లే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సంస్థానము ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన అధ్యక్షుడు కేశవ్ ఇంగ్లే, గౌరవ అధ్యక్షుడు వామన్ ఇంగ్లే, డుక్రె సుభాష్, భగవంత్‌రావ్, మాగాడే దాదారావ్, మాజీ సర్పంచ్ బాలాజీ ఖండారె,కుంర కేశవ్, బీఆర్ఎస్ నాయకులు భీంరావ్,సతీశ్ ముండే సమాధాన్, మారు, సభ్యులు గిరె సుధామ్,ఆత్రం రాము పాల్గొన్నారు.