కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండల కేంద్రంలో గురువారం వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులలో ప్రభుత్వం అందించిన మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ( Fish distribution ) చేశారు. గురువారం కాసిపేట లో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అధికారుల చేతుల మీదుగా మత్స్యకారులకు చేప పిల్లలు అందించారు.
ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి కార్యదర్శి మేఘన, కోమటిచేను కార్యదర్శి ఉదయ్, ధర్మారావుపేట కార్యదర్శి అన్నపూర్ణ, రొట్టెపల్లి కార్యదర్శి సౌందర్య, ఫిషరి అస్సిటెంట్ నీలా, ప్రధాన కార్యదర్శి మైదం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, సిరాజ్ ఖాన్, జాడి శంకర్, షారూఖ్, తోడేటి ప్రశాంత్, అక్కెపల్లి రాజేష్, మెరుగు శ్రీనివాస్, బాకీ నరేష్, బొగ్గుల నర్సయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.