ఇంద్రవెల్లి : మండలంలోని శంకర్ గూడ ( Shankerguda) గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తుంరం లక్ష్మణ్ (Laxman) అనారోగ్యంతో ( Illness) మృతి చెందాడు. లక్ష్మణ్ సంవత్సరం నుంచి రక్తహీనతతో బాధపడుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో (RIMS) వైద్యం పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసీఆర్ హయాంలో తండాలను పంచాయతీలుగా ఏర్పడిన తరువాత నిర్వహించిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.