అధికారులు ప్రజల పక్షాన ఉండాలి.. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అధికారులు ప్రజల పక్షాన ఉండాలి.. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తానా అంటే తందానా అనే రీతిలో వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
- రాజకీయ నాయకులకు వంతపాడొద్దు
- రేవంత్ రైతు భరోసా ఎగ్గొట్టారు
- ప్రశ్నించే వారిపై కేసులు దుర్మార్గం
వనపర్తి,మార్చి 15(నమస్తే తెలంగాణ) : అధికారులు ప్రజల పక్షాన ఉండాలి.. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తానా అంటే తందానా అనే రీతిలో వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. నాయకుల సంతోషం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టే సంస్కృతిని అమలు చేస్తున్న పోలీసు అధికారులు పునరాలోచించుకోవాలని సూచించారు.
ఆదివారం వనపర్తిలోని తన నివాసంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేయని పథకాలపై ప్రశ్నించినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రైతులకు కరెంటు, యూరియా సరఫరా సక్రమంగా లేనందున నష్టాలపాలవుతున్నారని, రైతు భరోసా ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
శ్రీధర్‌రెడ్డి హత్యను ఛేదించాలి..
చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసును రెండున్నరేళ్లుగా ఛేదించక పోవడం విచారకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసును ఎందుకు విచారణ పేరుతో పెండింగ్ పెట్టారని ప్రశ్నించారు. పోలీసు శాఖలో చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు ఇలాంటి చర్యలు తలవంపులు తెస్తున్నాయని చెప్పారు.
వారం రోజుల్లో శ్రీధర్‌రెడ్డి హత్యకేసును ఛేదించని పక్షంలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టవద్దని, గతంలో మంజూరైన బైపాస్ రోడ్డును పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి వేర్వేరుగా లేఖలు పంపుతున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

