మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 24 : ‘వచ్చే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఎమ్మెల్యే పీఎస్సార్ అంటున్నడు. అప్పటి దాకా ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేసి రా.. పోటీకి దిగుదాం. ఒకవేళ అంత మెజార్టీ వస్తే మేము రాజకీయాలను వదిలేస్తం’ అంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆ యన తనయుడు, బీఆర్ఎస్ నాయకుడు విజిత్రా వు సవాల్ విసిరారు.
మంగళవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివాకర్‌రావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మంచిర్యాల ప ట్టణాన్ని మాఫియాలకు అడ్డాగా మార్చారని, ఇక్క డ జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు కోరారు. ఎమ్మెల్యే పీఎస్సార్ తప్పుడు ఆరోపణలు చేసి తమపై బురదజల్లే ప్రయ త్నం చేస్తున్నారని, ఆయన మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు.
ఎమ్మెల్యేను హత్య చేయించడానికి తాము సుపారీ ఇచ్చినట్లు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. అవి పూ ర్తిగా సత్యదూరమైన వ్యాఖ్యలని, ఇందులో ఎలాం టి వాస్తవం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులపై కబ్జాదారులని ఎమ్మెల్యే ఆరోపణలు చేశార ని, అయితే అతను ఆరోపించిన వాళ్లంతా ప్రస్తుతం ఆయన దగ్గరే ఉన్నారని, ఇప్పుడు కబ్జాల విషయం మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆయన మిత్రుడైన ఓ వ్యాపారికోసం మార్కెట్లో చిరువ్యాపారులను దూరంగా తరలించి వారి పొట్టకొడుతున్నారని ఆరోపించారు.
గడప రాకేశ్, బేర సత్యనారాయణపై కేసులు పెట్టే విషయంలో పోలీసులు అనుసరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని, తాము ఫిర్యా దు చేస్తే వారి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. అసత్య ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టే దిశగా కట్టుకథలు అల్లుతున్నారని, ప్రజలకు నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నా రు. గంజాయి, తాగుడు, పేక ఆటలవంటి వాటికి తాము వ్యతిరేకమని, అలాంటి అలవాట్లు ఉండకూడదని ఎందరో కార్యకర్తలకు హితబోధ చేశానని గుర్తుకు చేశారు.
గంజాయి విషయంలో కట్టు కథ లు అల్లి తమపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వందలాది మంది పీఎస్సార్ బాధితులు హైదరాబాద్‌లోని కాప్రాలో సీ ఎం, డిప్యూటీ సీఎం ఎదుట ఆందోళనలు చేశారని, ఎంతోమంది భూములు ఆక్రమించుకున్న ఆయనకు ఆక్రమణల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. టీబీజీకేఎస్ నాయకుడు అన్నయ్య భ వనం కూల్చివేత సరైంది కాదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆలోచన చేయాల్సిందన్నారు.
కానీ ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే కూల్చారని, కూలగొట్టే ముందు కనీసం వారికి సమాచారం ఇవ్వలేదని, అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రతీరిటైర్డ్ కార్మికునికి రెండు గుంటల స్థలం ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏసీసీ దగ్గర 57 ఎకరాలు తనపై ఉందని ఆ రోపణ చేశాడని, తనకు సంబంధం లేదని సీసీఎల్ఏకు నేనే దరఖాస్తు ఇచ్చానన్నారు. ‘ఇప్పుడు నీ చే తిలోనే ప్రభుత్వం ఉంది, అధికార యంత్రాంగం నీ చేతిలోనే ఉంది, 57 ఎకరాలు బయటకు తీయా లి. మున్సిపల్ నిధులతో జంక్షన్లు అభివృద్ధి చేస్తే దానిని విమర్శించారు.
బైపాస్‌రోడ్డును నిర్మిస్తే విమర్శించారు. ఇపుడు ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అండర్‌బ్రిడ్జి వల్ల టూటౌన్ ఎంతో అభివృద్ధి చెందుతోంది’ అని అన్నారు. తెలంగాణకే గుండెకాయలాంటిది ఎల్లంపల్లి ప్రాజెక్టు అని, దీని ని తాను మంజూరు చేయించానని, ఈ ప్రాజెక్టే లే కుంటే సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు ఎక్కడిదని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ, 400 బెడ్స్ హాస్పిటల్ తానే మంజూరు చేయించానన్నారు. 57 ఏళ్లకింద కట్టిన జీజీహెచ్‌ను మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోకే తరలిస్తారని, ఎంసీహెచ్కూడా మెడికల్ కా లేజీ హాస్పిటల్లోకే వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించారని, మరి మంచిర్యాలలో ఉండవద్దా అని ప్రశ్నించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఐటీఐ లో, నస్పూరులో నిర్మిస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్ప టి వరకు ఆ దిశగా ప్రయత్నించలేదని ఎద్దేవా చేశా రు. హాజీపూర్ హన్మంతరావు దగ్గర 1400 గజాల భూమిని రూ. 10లక్షలు ఇచ్చి తీసుకున్నాడని, 500 గజాల ప్రభుత్వ భూమి ఇప్పిస్తానని నమ్మించాడని, ఇతను చేసిన మోసానికి అప్పులు కట్టలేక ఆయన చనిపోయాడని చెప్పుకొచ్చారు.
తాను కమిషన్ కోసం కక్కుర్తి పడ్డానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. తాను కక్కుర్తి పడితే భూ దాన్ భూమి కాపాడేవాడినా, మార్కెట్ కమిటీ భూ మి కాపాడేవాడినా, రెడ్‌క్రాస్ దగ్గర స్థలం, రాజీవ్‌నగర్ స్థలం కాపాడే వాడిని కాదుకదా అన్నారు. రా ష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో నీరిచ్చానని ఎమ్మెల్యే అబద్ధాలు మాట్లాడుతున్నాడని, వాస్తవానికి తానే తాగునీటి పథకాలకు నిధులు తీసుకువచ్చానని చెప్పారు. మున్సిప ల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు గాదెసత్యం, మొగిలి శ్రీనివాస్, అక్కూరి సుబ్బయ్య, మందపల్లి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, నరేశ్, శ్రీపతివాసు, సాగి వెంకటేశ్వరరావు, సుంకరి రమేశ్, తాజుద్దీన్ పాల్గొన్నారు.