శివాజీ పరిపాలన ఆదర్శప్రాయం
ఛత్రపతి శివాజీ పరిపాలన నేటికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని రణదీవేనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
- మాజీ మంత్రి జోగు రామన్న
- విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
ఎదులాపురం, డిసెంబర్ 13 : ఛత్రపతి శివాజీ పరిపాలన నేటికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని రణదీవేనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా జోగు రామన్నకు నాయకులు శివాజీ మహారాజ్ చిత్రపటం అందజేసి శాలువాతో సన్మానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మొదట కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై ప్రజలు నమ్మకం పెట్టి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
శివాజీ మహారాజ్ పాలనతో లేనటువంటి అసమానతలను నేడు కొన్ని పార్టీలు చూయించడం సబబు కాదని హెచ్చరించారు. ఎల్లవేళలా ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పల్లెలు, పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. పాత పనులు కాకుండా కొత్త పనులు చేసి వారి పారదర్శకతను నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, అధికార ప్రతినిధి గంగారెడ్డి, కౌన్సిలర్లు అశోక్‌స్వామి, వెనుగంటి ప్రకాశ్, భరత్ కుమార్, ఇమ్రాన్, నాయకులు పర్వీన్ ఫెరోజ్, మంచికట్ల ఆశమ్మ, నంద, రమ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

