బెల్లంపల్లి, ఏప్రిల్ 17 : కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను ముంచేశారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. గురువారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్‌ను తిరిగి గెలిపించుకోవాలనే ధృఢనిశ్చయంతో ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ, యూత్ అధ్యక్షుడు సబ్బని అరుణ్, నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, రెవెల్లి విజయ్‌కుమార్, అలీ, మద్దెల గోపీ, లింగంపల్లి రాములు, ఎరుకల సుందర్రావు తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
కన్నెపల్లి, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలో రజతోత్సవ సభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నిరంజన్ గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆకుతోట రాజయ్య, మాజీ ఎంపీపీ శంకర్, గణేశ్, అశోక్, సాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జోరుగా ప్రచారం
మందమర్రి, ఏప్రిల్ 17 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభపై జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాతబస్టాండ్, ప్రాణహిత కాలనీ, ఎనిమిదో వార్డు, మూడో జోన్ ఏరియాల్లో వాల్ రైటింగ్ చేస్తూ.. వాల్ పోస్టర్లను అంటించారు. బీఆర్ఎస్ నాయకులు మద్ది శంకర్, కనకం రవీందర్, పూసాల ఓదెలు, పల్లె నర్సింగ్, సేపూరి లక్ష్మణ్, శేఖర్, మహిళా నాయకులు సుజాత, సైరాబాను, రోజా తదితరులు పాల్గొన్నారు.
సభపై సమావేశం
సిర్పూర్(యూ), ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు తొడసం ధర్మరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, సభ విజయవంతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఆత్రం భగవంత్‌రావు, వీటీడీఏ సంఘాల మండల అధ్యక్షుడు కుంర భీంరావు, నాయకులు అర్క నాగోరావు, అర్జు తదితరులు పాల్గొన్నారు.
గోడ ప్రతుల విడుదల
చింతలమానేపల్లి, ఏప్రిల్ 17 : గూడెం, కోయపెల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కుకడ్కర్ భాస్కర్, సోయం తిరుపతి ఆధ్వర్యంలో గోడ ప్రతులను విడుదల చేశారు. నాయకులు చల్లూర్కర్ కుమార్, సంతోష్, రాములు, కార్యకర్తలు ఉన్నారు.