బెల్లంపల్లి/వేమనపల్లి, జనవరి 9 : కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. వేమనపల్లి మండల గొర్లపల్లి గ్రామపంచాయతీ కొత్తకాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముల్కల్ల శంకర్ కుటుంబానికి గురువారం పట్టణంలోని తన నివాసంలో రూ.రెండు లక్షల ప్రమాదబీమా చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న శంకర్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో చెక్కు మంజూరైందని తెలిపారు. బాధిత కుటుంబాలను కాపాడుకునే బాధ్యత పార్టీపై ఉందని పేర్కొన్నారు.
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వేమనపల్లి మండల అధ్యక్షుడు కోళి వేణుమాధవ్‌రావు, మాజీ ఎంపీపీ సుభాష్‌రావు, మాజీ సర్పంచ్ మోర్ల పద్మ, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, నాయకులు పుణ్ణం, మొండి, పర్వతాలు, బూరం బానయ్య, శ్రీశైలం, బానేష్ పాల్గొన్నారు.