కాంగ్రెస్ ఓ డ్రామా కంపెనీ
“కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
- ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా నాటకాలు
- ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మొద్దు
- కాళేశ్వరంలోఒక్క పిల్లర్ దెబ్బతిందన్న సాకుతో మొత్తం రైతాంగానికి తీవ్ర అన్యాయం
- బీఆర్ఎస్ను గెలిపించి.. హస్తం పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి
- బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
- మంచిర్యాలలో మార్నింగ్ వాకర్స్, కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థన
- నాయకులతో కలిసి అల్పాహారం
- కారుకు భారీ మెజార్టీ రావాలి
- మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
మంచిర్యాలటౌన్, మార్చి 26 : “కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.’ అని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం మంచిర్యాలలోని కాలేజీరోడ్డు, బాలుర పాఠశాలలో మార్నింగ్ వాకర్స్‌ను మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి మాట్లాడారు. ఆపై డిగ్రీ కాలేజీ మైదానంలో స్థానికులతో కలిసి మెడిటేషన్ చేశారు. లేబర్అడ్డాలోని కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అంతకుముందు పాత గర్మిళ్లలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్పీ రోడ్‌లోని టిఫిన్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయని వలస నాయకులు, వీకెండ్ వీరులు వస్తున్నారని, వారి ఆస్తుల కోసం, పరిశ్రమల రక్షణకోసం పరితపిస్తారే తప్ప ప్రజలకు చేసేదేమీ ఉండదన్నారు. 26 ఏళ్లుగా సింగరేణిలో కార్మికుడిగా పనిచేశానని, ఇక్కడి ప్రజ ల కష్టాలు, ఇబ్బందులు తెలుసునని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని చెప్పారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేకుండా ఉన్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కారుగుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే జరిగిన పరిణామాలను గుర్తించి ప్రజలు మంచి ని ర్ణయం తీసుకోవాలని, ఎంపీ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కూలిందన్న సాకుతో మొత్తం రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. అతి తక్కువ కాలంలో ఫెయిలైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, అది కేవలం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
అందరికీ సుపరిచితుడైన కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఇక్కడి సమస్యలు, అవసరాలు తెలిసిన వ్యక్తిని ఎంపీగా గెలిపించుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఈ మధ్య కాలంలో ఇష్టారాజ్యంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెడుతున్నారని, ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ మరచి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, మహిళలకు రూ. 2500, రైతుబంధు, రూ. 500 బోనస్, తదితర హామీలిచ్చి మోసం చేసిందన్నారు. వరి పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, కౌన్సిలర్లు అంకం నరేశ్, గాదెసత్యం, నాయకులు సందె ల వెంకటేశ్, సుంకరి రమేశ్, తాజొద్దీన్, సుధీర్, శ్రీపతివాసు, శ్రీరాముల మల్లేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

