మంచిర్యాలటౌన్, మే 11: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారిచ్చిన హామీలతో పాటు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆగిపోతాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చిందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక సీట్లు వస్తాయన్న నమ్మకం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని, నిరంతరం విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, తాగునీరు, సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేస్తే గోదావరి నిండుకుండలా ఉండేదన్నారు. తెలంగాణను దేశానికే దిక్సూచిలా నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని , అలాంటి వ్యక్తిపై ఇష్టంవచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు తట్టుకోలేక పోతున్నారన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన పనులు కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీల్లో మంజూరైన పనులను రద్దుచేసి తమకు అనుకూలమైన ప్రాంతాల్లో పనులు చేస్తున్నారని అన్నారు.
మంచిర్యాల ప్రజల చిరకాల కోరిక అయిన అంతర్గాం వంతెనను ఇక్కడి ఎమ్మెల్యే వద్దంటున్నాడని, ఆయనకు ప్రజల నాడి పట్టదా అని ప్రశ్నించారు. ఇప్పటికే నిధులు మంజూరై. టెండరు ప్రక్రియ పూర్తిచేసుకుని, టెస్టింగ్ పనులు పూర్తయి, ఒకపక్క భూసేకరణ కూడాపూర్తయి ఉన్న బ్రిడ్జిని రద్దుచేయాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెటం రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు గాదెసత్యం, అంకం నరేశ్, రవీందర్‌రెడ్డి, సుంకరి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరుతూ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ ఐబీ చౌరస్తానుంచి ఓవర్‌బ్రిడ్జి మీదుగా కొనసాగింది. అదానీ బొగ్గును కొనుగోలు చేసేందుకు సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని, అందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతులు కలిపారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్స్ నాయకులు విజిత్‌రావు, గాదెసత్యం, అంకం నరేశ్, గోగుల రవీందర్‌రెడ్డి, సుంకరి రమేశ్, పెంట ప్రదీప్, రమేశ్‌యాదవ్, తోట తిరుపతి, వెంకటసాయి, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, మే 11: నస్పూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు వినూత్నకాలనీలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు స్థానిక కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గర్శె భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి, మే 11 : బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం వేమనపల్లిలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమైందన్నారు. ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు కుబిడె మధుకర్, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ కుబిడె వెంకటేశ్, లక్ష్మీనారాయణ, తలండి భీమయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాండూర్, మే 11 : తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష, కేసీఆర్‌తోనే అభివృద్ధి, సంక్షేమం జరిగింది అంటూ ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పిటీసీ సాలిగామ బానయ్య, బోయపల్లి ఎంపీటీసీ, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి, బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాసిపేట, తాండూర్, ద్వారాకాపూర్, బోయపల్లి, చౌటపల్లి, అచ్చలాపూర్, రేచిని, మాదారంతో పాటు పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గొర్లపెల్లి విజయ్, తిరుపతి, వెంకటేశ్, సంతోష్, అక్షయ్, మణికంఠ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాసిపేట, మే 11 : కాసిపేట మండలంలోని పెద్దనపల్లిలో ఇంటింటా ప్రచారంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, గ్రామ అధ్యక్షుడు వెల్ది శ్రావణ్, సీనియర్ నాయకులు చింతల భీమయ్య, యూత్ అధ్యక్షుడు వంశీ, రెడ్డి కనకయ్య, జీదుల కనకయ్య, ఎల్లయ్య, తిరుమల చారి, బచ్చన మనోహర, సరోజన తదితరులు పాల్గొన్నారు. ముత్యంపల్లిలో ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, నాయకులు బోయిని సాయి కుమార్, బోయిని అంజన్, సోనేరావు, సోము పాల్గొన్నారు.
మందమర్రి, మే 11: బీఎస్పీ మంచిర్యాల జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద బీఆర్ఎస్లో చేరారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బీఎస్పీలో చేరిన వినోద తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నివాసంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ వినోదను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎంవీ.గుణ, రాం వేణు, మద్ది శంకర్, కనకం రవీందర్, ఏల్పుల కిరణ్, రమాదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
మోసపూరిత కాంగ్రెస్‌కు గుణ పాఠం చెప్పాలి.
మందమర్రి, మే 11 : మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కి వంచించిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణ పాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను కోరారు. చెన్నూర్‌లో కేటీఆర్ఎస్ రోడ్ షోకు తరలివెళ్లే ముందు ఆయా కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు నమూనా ఈవీఎంలతో ప్రచారం చేశారు.
రామకృష్ణాపూర్, మే 12: చెన్నూర్‌లో కేటీఆర్ ప్రచార సభకు క్యాతనపల్లి పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్‌గౌడ్, వార్డు కౌలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, జిలకర మహేశ్, అలుగుల శ్రీలత సత్తయ్య, పారిపెల్లి తిరుపతి, గడ్డం సంపత్‌గౌడ్, జాడి శ్రీనివాస్, గడ్డం విజయలక్ష్మి రాజు, రామిడి ఉమాదేవి కుమార్, ఎల్లబెల్లి గంటాలమ్మ మూర్తి, బీ అనిల్‌రావు, పార్వతి విజయ, వార్డు ఇన్చార్జిలు, నాయకులు, తదితరులు తరలివెళ్లారు.
మందమర్రి రూరల్, మే11: చెన్నూర్‌లో మాజీమంత్రి కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు శనివారం మండలంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.