కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలి
మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షోను విజయవంతం చేయాలని చె న్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ శ్రేణులను కోరారు.
- మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
- మందమర్రిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం
మందమర్రి, ఏప్రిల్ 29 : మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షోను విజయవంతం చేయాలని చె న్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ శ్రేణులను కోరారు. సోమవారం మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ నివాసంలో ఏర్పా టు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ రోడ్ షోకు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించాలన్నారు. పట్టణంలో ఇంటింటా ఎ న్నికల ప్రచారం నిర్వహించాలని, మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలన్నారు. మే 7న క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో బూత్ లెవల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రోడ్ షో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని, అన్ని ప్రాంతాలలో విశేష స్పందన లభిస్తున్నదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనలకు సంబంధించిన వివరాలను నాయకులకు వివరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సీనియర్ నాయకులు ఓ.రాజశేఖర్, ఎండి.అబ్బాస్, బత్తుల శ్రీనివాస్, మద్ది శంకర్, బడికెల సంపత్‌కుమార్, బండారు సూరిబాబు, బర్ల సదానందం, ఈశ్వర్, వేణుగోపాల్ రెడ్డి, సీసెల్లి సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

