ఎదులాపురం, జూన్ 15 : ఆదిలాబాద్ యువత భవిష్యత్ కోసం సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అత్యవసరమని, ఈ లక్ష్యంతో మంగళవారం నిర్వహించనున్న ‘హలో యువత.. చలో సీసీఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఆ ర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి సీసీఐ పరిశ్రమ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీసీఐ పరిశ్రమ రక్షణ కోసం యువత, విద్యార్థు లు, కార్మికులు, ప్రజాసంఘాలు అన్ని వర్గాల వారు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.