ఎదులాపురం, నవంబర్ 1 : నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని, లేనియెడల ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతులు ఎదురొంటున్న నష్టాలపై వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టంపై రైతులకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదురొంటున్న నష్టాలపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు.
కలెక్టర్‌కు పలుసార్లు సమస్యలపై విన్నపించిన స్పందించక పోవడం జరుగుతుందన్నారు. తేమ సాకుతో మారెట్లోనే నాలుగైదు రోజులు వేచి ఉండేలా చేయడం తగదన్నారు. రైతు సమస్యల పరిషారానికి బీఆర్ఎస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుత్ మనోహర్, యాసం నర్సింగ్‌రావు, మెట్టు ప్రహ్లాద్, సేవ్వా జగదీష్, దేవీదాస్, ఉగ్గే విఠల్, గెడం రాజు పాల్గొన్నారు.