ఎదులాపురం, మే 8 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగు రామన్న గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు.
అనంతరం ఆదిలాబాద్ ని యోజకవర్గ అభివృద్ధికి సం బంధించిన అంశాలు, ఇతరత్రా విషయాలపై చర్చించారు. మాజీ మంత్రి వెంట నాయకుడు అష్రాఫ్ ఉన్నారు.