ఎదులాపురం, ఆగస్టు 4 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిషరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఆటో కార్మికుల హకుల సాధన కోసం బీఆర్ఎస్ ఆటో కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
మంగళవారం నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఆటో కార్మిక యూనియన్ కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయంలో జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సతరించి, మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతంతోపాటు ఆటో కార్మికుల సమస్యల పరిషారానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి ఆటో టాక్సులపై ఉన్న భారం తగ్గించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సుల జారీకి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆటో కార్మికులను మోసం చేసిందని ఆరోపించా రు. ప్రయాణికుల కొరత కారణంగా అనేక మంది ఆటో కార్మికులు తీ వ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చిన రూ.12 వేలు ఆర్థిక సహాయా న్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆటో కార్మికుల సమస్యలు పరిషారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బట్ట సతీష్, అశోక్, దివిటి రాజు, ద యానంద్, షేక్ నయీమ్ భాయ్, చింగం శివ, నారాయణ, మయూరుల్లాకా, సిద్ధార్థ్, షేక్ రహీం, బాబు షా, అస్లాం, పస్సి, పాల్గొన్నారు.