హాజీపూర్, నవంబర్ 26 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు. మాధవరపు రామారావు బీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందని, ఆ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, హాజీపూర్ మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సాగి వెంకటేశ్వర్రావు, పల్లె భూమేశ్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మంచిర్యాల పట్టణ నాయకులు అంకం నరేశ్, తోట తిరుపతి పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
దండేపల్లి, నవంబర్ 26 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన యువనాయకుడు బొలిశెట్టి సిద్ధార్థ్ బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
లక్షెట్టిపేట, నవంబర్ 26 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పేరొన్నారు. బుధవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తిప్పని లింగన్న, మండల అధ్యక్షుడు చుంచు చిన్నన్న, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, అంకతి గంగాధర్, దండేపల్లి నాయకులు మాజీ వైస్ ఎంపీపీ అనిల్, పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, వైస్ చైర్మన్ అకల రవి తదితరులు పాల్గొన్నారు.