పథకాలను చూసి ఆదరించండి
ఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఆదరించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్(బీ), కన్గుట్ట, కౌఠ(బీ) గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులతో కలిసి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- మాజీ ఎంపీ నగేశ్
- జాదవ్ అనిల్ గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణుల ముమ్మర ప్రచారం
బోథ్, నవంబర్ 23: బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఆదరించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్(బీ), కన్గుట్ట, కౌఠ(బీ) గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులతో కలిసి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ హయాంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్లు వంటి పథకాలు అమలయ్యాయన్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ స్వామి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
బోథ్‌లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
బోథ్, నవంబర్ 23: బోథ్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సుభాష్, పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, రైతు సంఘం మండలాధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్, ఇఫ్తేకర్, సోషల్ మీడియా కన్వీనర్ ముబిన్, వార్డు సభ్యుడు రాకేశ్, మల్లేశ్, సలీం, వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.
తలమడుగులో..
తాంసి(తలమడుగు), నవంబర్ 23 : తలమడుగులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా నాయకుడు పిడుగు సంజీవరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అభిరాంరెడ్డి, మేకల రవికాంత్ యాదవ్, రవీందర్, నేతుల గంగన్న, సత్యపాల్, సునీతారెడ్డి, నిఖిల్ రెడ్డి, శ్రీకాంత్, నారాయణ పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, నవంబర్23: మండలంలోని కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్, గుబిడి , కరణ్‌వాడి గ్రామాల్లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచ్‌లు ఎల్పుల ప్రతాప్, కుడిమెత రేఖ, నాయకులు నరేందర్‌యాదవ్, మారుతి పటేల్, ఆకటి నరేందర్‌రెడ్డి, బక్కి కపిల్, ఉల్లాస్, ఎం కల్చాప్యాదవ్, తూడి విఠల్, దత్తు, సిల్వర్ రమేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసిలో..
తాంసి, నవంబర్ 23 : కారు గుర్తుకు ఓటేస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్, సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి పూజలు చేసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రజినీకాంత్, పరమేశ్ పాల్గొన్నారు.
జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి
నేరడిగొండ, నవంబర్ 23 : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి కోరారు. గురువారం మండలంలోని గుత్పాల, యాపల్‌గూడ, వడూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, విశాల్‌కుమార్, గస్కంటి రవి, వీడీసీ చైర్మన్ ఎలేటి రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ అంబేకర్ పండరి, సీనియర్ నాయకులు సయ్యద్ జహీర్, ఉప్పు పోశెట్టి, మద్దెల నారాయణ, ఆడెపు రమేశ్, అడెల్లు, రఫీ, తిరుపతి, లచ్చన్న, మదన్‌సింగ్, శ్రీకాంత్, ఫయాజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

