ఆదిలాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను నివారించడానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో జిల్లా, మండల స్థాయి లో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందా లు జిల్లా కేంద్రంతోపాటు గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటాయి. వానకాలం ప్రారంభంకావడంతో ఈ ఏడాది 5.60 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాధికారులు అంచనా వేశారు.
అధికంగా పత్తి 4 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు తెలిపారు. వర్షాలు పడుతుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకున్నది. పత్తి పంటను వేసే రైతులు వివిధ కంపెనీలకు చెందిన బీటీ-2 విత్తనాలను వినియోగిస్తారు. ప్రస్తుతం 475 గ్రాముల బీటీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.901 ఉండగా, రైతులకు అవసరమైన 13 లక్షల విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
పకడ్బందీ చర్యలు
వానకాలంలో రైతులు దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు నష్టపోవాల్సి వస్తుంది. దళారులు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. లేబుళ్లు లేకుండా, వివిధ కంపెనీల పేరిట తయారు చేసిన ప్యాకెట్లతోపాటు విడిగా విత్తనాలను విక్రయిస్తుంటారు. పత్తి చెట్టు బాగా పెరిగినా కాత రాకపోవడం, విత్తనాలు మొలకెత్తకపోవడం, మొక్కలు ఎదగకపోవడం, ఇతర కారణాల వల్ల రైతులు వేల రూపాయలు పె ట్టుబడితో సాగు చేసిన పంటలు చేతికిరాకుండా పోతున్నాయి.
రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇచ్చోడ మండలంలో 27 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు పట్టుకు ని నలుగురు వ్యక్తులపై, బేల మండలం సిరిసన్నలో 26 నకిలీ విత్తన ప్యాకెట్లు, పది కిలోల లూజ్ నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గుర్తింపు పొందిన డీలర్లు, దుకాణాల్లో మాత్రమే విత్తనాల ను కొనుగోలు చేయాలని, విత్త న ప్యాకెట్లపై సరైన లేబ ల్, ఎక్స్పరీ డేట్, తయారీ డేట్లు చూసుకోవాలని,జీఈఏసీ నంబరు ఉండాలని, ప్యాకెట్లను మాత్ర మే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.