నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రానికి చెందిన పసికందు బాలుడి తల్లి్
దుర్వా సెకుబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా వారికి ఆరు నెలల పసి బాలుడు ఉన్నాడు. పసికందును ( Orphan ) ఆదుకోవడానికి ఆంజనేయ యూత్ సభ్యులు దాతల సహయం కోరడంతో అభిమాన్యు అడ్మిన్ మెస్రం శేఖర్ బాబు స్పందించారు. పసికందును ఆదుకోవాలని ఆయన విరాళాలు సేకరించారు. బుధవారం గాదిగూడ మండల కేంద్రంలో పసికందు తండ్రికి గులాబ్కు గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ సార్ మేడి జూగన్నాక్ భీం రావ్ చేతులు మీదుగా రూ. 21 వేలను అందజేశారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు అభిమాన్యు సంఘం సభ్యులు ఎల్లవేళలో అందుబాటులో ఉంటారని గ్రూప్ అడ్మిన్ మెస్రం శేఖర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం మనోహర్ పటేల్, ఝరి రాయి సెంటర్ గిత్తేదార్ కోడప జాకు, మాజీ సర్పంచ్ మెస్రం జైవంత్ రావ్, ఉపాధ్యాయులు మెస్రం లింగు, రామారావు, తుకారామ్, కేశవ్, అజయ్, భీం రావ్, కనక ప్రభాకర్, నైతం భీం రావ్, పాండురంగ, నాగోరావు పాల్గొన్నారు.