మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 27 : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఫీజు పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు కాకపోవడంతో విద్యార్థులు పై చదువులు చదవలేక పోతున్నారని, కాలేజీల్లో పెట్టిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని కోరారు.
13 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తున్నదని, విద్యార్థులు, సంఘాలు నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ఫీజులు విడుదల చేస్తామని చెప్పిన నాయకులు రెండున్నరేళ్లు గడుస్తున్నా స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడెపు అరుణ్‌ప్రసాద్, దగ్గుల మధుకుమార్, చోటు, తిరుపతి, బెల్లం అరుణ్, ఎండీ ముస్తాఫా, మెహరన్ దేవి, సాయికృష్ణ, దాసరి నవీన్ పాల్గొన్నారు.
నస్పూర్, ఏప్రిల్ 27 : ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏవోకు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు, కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది కానీ, 13 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం చెల్లించడం లేదన్నారు. వీటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్ ప్రసాద్, మధుకర్, చోటు, తిరుపతి, అరుణ్, ముస్తాఫా, సాయికృష్ణ, నవీన్ పాల్గొన్నారు.