Sailor Ashish Kumar : తన భర్త బతికే ఉన్నాడంటూ మర్చంట్ నేవీ కెప్టెన్ (Merchant Navy Captain) ఆశిష్ కుమార్ (Ashish Kumar) భార్య సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. ఆయనను కోర్టు ముందుకు తీసుకువచ్చేలా హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ (Habeas corpus writ petition) వేశారు. ఒమన్ తీరం (Oman Coast) లో నౌకపై జరిగిన దాడిలో ఆశిశ్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.
బిహార్‌లోని బెట్టియాకు చెందిన ఆశిశ్ కుమార్.. ఒమన్ తీరంలో స్కైలైట్ చమురు ట్యాంకర్‌పై జరిగిన డ్రోన్ దాడిలో మరణించినట్లు భావిస్తున్నారు. పశ్చిమాసియా ఘర్షణలు ప్రారంభమైన సమయంలో మార్చిలో ఆ దాడి జరిగింది. అప్పుడు నౌకలో 10 మంది భారత నావికులు ఉన్నారని ఒమన్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. అయితే వారిలో ఎనిమిది మందిని రక్షించామని, ఇంజిన్ రూమ్‌లో ఉన్న కెప్టెన్ కుమార్, మరో సిబ్బంది దలిప్ గల్లంతయ్యారని తెలిపింది.
మార్చి నాలుగున కెప్టెన్ రూమ్‌లో కాలిన శరీర అవయవాలను ఒమనీ తీర రక్షణ సిబ్బంది గుర్తించినట్లు వెల్లడైంది. కెప్టెన్ రూమ్‌లోకి ఇంకెవరూ ప్రవేశించలేదని, అవి కుమార్వే కావొచ్చని అప్పట్లో ఎంబసీ పేర్కొన్నది.